![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -661 లో.... యామిని రాజ్ కి ఫోన్ చేస్తుంది. హాలో ఒక సర్ ప్రైజ్ ఉంది. అది నువ్వు మాత్రమే చూడాలని అంటుంది. దాంతో రాజ్ ఎవరు హాల్లోకి రాకముందు వెళ్తాడు. అక్కడ యామినితో కలిసి ఉన్న ఫొటోస్ చూసి షాక్ అవుతాడు. ఎవరైనా వస్తారేమోనని అన్ని ఫోటోస్ తీస్తాడు. అప్పుడే అందరు హాల్లోకి వస్తారు. ఏమైంది రాజ్ అని పక్కకి జరగమని సుభాష్ అంటాడు. రాజ్ ఫొటోస్ పై కూర్చొని ఉంటాడు. నాకు నడుం నొప్పిగా ఉంది.. నేను లేవనని అంటాడు.
కావ్య కిచెన్ లోకి వెళ్తుంటే.. అప్పుడే రాజ్ కి యామిని మెసేజ్ చేస్తుంది. మరి కిచెన్ లో పెట్టిన ఫొటోస్ సంగతి ఏంటనగానే రాజ్ కావ్యని పిలిచి పైన ఫోన్ ఉంది తీసుకొని రమ్మని చెప్తాడు. కావ్య పైకి వెళ్తుంది. రాజ్ త్వరగా కిచెన్ లోకి వెళ్లి అక్కడున్నా ఫొటోస్ తీసుకుంటాడు. ఆ తర్వాత రాజ్ బయటకు వచ్చి హాస్పిటల్ కి ఫోన్ చేస్తాడు. మీ హాస్పిటల్ లో డ్రగ్ ఎడిక్ట్ పేషెంట్ ఉండాలి కదా అని అడుగుతాడు. తను క్యూర్ అయి డిశ్చార్జ్ అయింది. మీరు ఫోన్ చేస్తారని చెప్పి మీకు అడ్రెస్ చెప్పమంది. ఈ నెంబర్ కి తన అడ్రెస్ పంపిస్తున్నానని అతను రాజ్ కి అడ్రెస్ పంపిస్తాడు. రాజ్ టెన్షన్ పడుతుంటాడు. రాజ్ యామిని దగ్గరికి వెళ్తు గతాన్ని గుర్తుచేసుకుంటాడు. రాజ్ కాలేజీ డేస్ లో యామిని తనని ఇష్టపడుతుంది. తన మాటలతో రాజ్ ని ఇంప్రెస్ చేస్తుంది. రాజ్ కూడా తనని ప్రేమిస్తాడు.
ఒకరోజు రాజ్ తన ఫ్రెండ్ తో క్లోజ్ గా ఉండడం చూసిన యామిని తనపై ఎటాక్ చేయిస్తుంది. అది తెలుసుకున్న రాజ్.. యామినిని కొడతాడు. నువ్వు నాకు మాత్రమే సొంతం.. వేరొకరితో క్లోజ్ గా ఉంటే నాకు నచ్చాదని యామిని అనడంతో.. నువ్వు ఇంత శాడిస్ట్ లా ఉన్నావ్.. నాకు నువ్వు వద్దు అంటూ రాజ్ వెళ్ళిపోతాడు. నువ్వు నన్ను ప్రేమించకపోతే కాలేజీ పైనుండి దూకుతానంటూ బెదిరిస్తుంది. తను కిందకి వచ్చేవరకు చూసిన రాజ్ వెంటనే పోలీసులకి పట్టిస్తాడు. ఆ తర్వాత రాజ్ ఉండే హాస్టల్ కి వెళ్లి అక్కడ చెయ్ కోసుకుంటుంది. తనని దూరం పెట్టాలని రాజ్ ఎవరికీ చెప్పకుండా అక్కడ నుండి హైదరాబాద్ వచ్చేస్తాడు. యామిని డ్రగ్స్ కి అలవాటు అయి హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటుంది క్యూర్ అవుతుందని తెలిసి పోనిలే అన్ని మర్చిపోయి బాగుంటుందనుకున్నా కానీ ఇలా మళ్ళీ నా లైఫ్ లోకి వచ్చిందని రాజ్ అనుకుంటాడు. తరువాయి భాగంలో రాజ్ వెళ్లేసరికి యామిని తమ పేర్లని పూలతో లవ్ సింబల్ లో డెకరేషన్ చేసి ఉంచుతుంది. నువ్వు నాకు కావాలి అని యామిని అంటుంది. కావ్య తప్ప నా జీవితం లో ఎవరు లేరని రాజ్ అంటాడు అది ఉంటేనే కదా నన్ను వద్దని అంటున్నావ్. దాన్ని లేకుండా చేస్తానని యామిని అనుకుంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |